క్రైమ్/లీగల్

డెబిట్ కార్డు దొంగిలించి 6.30 లక్షలు స్వాహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: దొంగిలించిన డెబిట్ కార్డు ద్వారా ఈ-కామర్స్ లావాదేవీలు నిర్వహించి రూ.6.30 లక్షలు స్వాహా చేసిన కేసులో ముగ్గురు నిందితులను సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సిసిఎస్ డిసిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజిగూడకు చెందిన నిషా కటారియా అనే మహిళ ఫిబ్రవరి 5న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా తన ఐసిఐసిఐ బ్యాంక్ అక్కౌంట్ నుంచి 2017 నవంబర్ 11 నుంచి 2018 జనవరి 23 మధ్య రూ.6,30,000 నగదు పోయినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సిసిఎస్ అధికారులు దర్యాప్తు కోసం సైబర్ సెల్‌కు బదిలీ చేశారు. విచారణలో కె.వినయ్‌కుమార్ (24), కొండా పవన్‌కుమార్ (22), మారం కృష్ణారెడ్డి (26) నిందితులుగా తేలింది. పేటియం మర్చంట్ ఇచ్చిన సమాచారంతో సిసిఎస్ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్‌కుమార్ రహస్యంగా బాధితురాలి ఐసిఐసిఐ డెబిట్ కార్డు వివరాలు, 3డి సెక్యూరిటీ పిన్ వివరాలను సేకరించాడు. ఆ వివరాలను తన పేటిఎం వాలెట్ అక్కౌంట్‌లో భద్రపర్చాడు. ఆ తర్వాత తన వాలెట్‌లోకి దశల వారీగా నిషా కటారియా అక్కౌంట్ నుంచి రూ.6.30 లక్షలు బదిలీ చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని నగదులోకి మార్చుకునేందుకు మిగిలిన ఇద్దరు నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన వ్యాలెట్ నుంచి రెండో నిందితుడు పవన్, మూడో నిందితుడు కృష్ణారెడ్డిల పేటిఎం వ్యాలెట్‌లోకి నగదు బదిలీ చేస్తానని, తనకు నగదు రూపంలో ఆ మొత్తం అందించాలని కోరాడు. ఇందుకు గాను 5 శాతం కమిషన్ ఇచ్చేందుకు వినయ్‌కుమార్ వారితో ఒప్పందం చేసుకున్నారు. ఇలా అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని జల్సాలకు వాడేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్ విపి తివారీ, ఎస్‌ఐ సురేష్ అదనపు డిసిపి రఘు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేశారు.

చిత్రం..నిందితులను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు