క్రైమ్/లీగల్

విశాఖ ఉక్కులో భారీ ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉక్కునగరం, జనవరి 18: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్ఫ్‌ర్నేస్-3లో గల క్యాస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఉదయం భారీ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాస్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఆస్తి నష్టం మాత్రం దాదాపు 50కోట్ల రూపాయల వరకు ఉంటుందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రమాదం కారణంగా బ్లాస్ట్ఫ్‌ర్నేస్‌లో గల యంత్ర పరికరాలతో పాటు ఒక జేసీబీ, రెండు ఫోర్క్‌లిఫ్ట్‌లు, కార్మికులకు చెందిన ఏడు ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. బ్లాస్ట్ఫ్‌ర్నెస్-3లో క్యాస్ట్‌హౌస్ పల్వరైజ్‌డ్ కోల్ (పిసిఐ)ను పంపించే క్రమంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బ్లోయర్ పైపు భారీ శబ్ధంతో పేలింది. దీని కారణంగా సింటర్, కోకో, హాట్ మెటల్ వంటి రా-మెటీరియల్స్ ఎగజిమ్మడంతో భారీగా శబ్ధాలు, మంటలు వ్యాపించాయి. పేలుళ్లతో అప్రమత్తం అయిన ఉద్యోగులు, అధికారులు, కార్మికులు పరుగులు తీశారు. సంఘటనా స్థలాన్ని ఉక్కు సీఎండీ పీకే రథ్‌తో పాటు ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నాయకులు పరిశీలించాయి.