క్రైమ్/లీగల్

ఆయేషా కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 18: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషామీరా హత్య కేసు విచారణను సిబిఐ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ కేసులో గతంలో జైలుశిక్ష అనుభవించి నిర్దోషిగా విడులైన పిడతల సత్యంబాబును అధికారులు విచారించారు. ఇదే సమయంలో తొలుత నుంచీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివంగత మాజీ మంత్రి కోనేరు రంగారావు మనుమడు కోనేరు సతీష్‌ను కూడా అధికారులు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి ఫార్మసీ విద్యార్ధినీ ఆయేషామీరా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని దుర్గాహాస్టల్‌లో అత్యాచారం, హత్యకు గురైన ఘటన గతంలో రాష్టవ్య్రాప్తంగా సంచలన కలిగిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో ఎన్నో మలుపుల అనంతరం కృష్ణాజిల్లా నందిగామ అనాసాగరానికి చెందిన పిడతల సత్యంబాబును నిందితునిగా విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతన్ని దోషిగా నిర్ధారిస్తూ విజయవాడ కోర్టు గతంలో జీవితఖైదు విధించింది. ఆ తర్వాత కొనసాగిన విచారణలో సత్యంబాబును నిర్దోషిగా నిర్ధారిస్తూ హైకోర్టు విడుదల చేసింది. అయితే అసలు దోషులను ఎవరో తేల్చాలని న్యాయస్ధానం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పునర్విచారణ ప్రారంభించింది. అయితే సిట్‌పై తమకు నమ్మకం లేదని ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన మీదట రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఆదేశాలతో కేసు సిబిఐకి బదిలీ అయింది. రంగంలోకి దిగిన సిబిఐ విచారణలో కేసుకు సంబంధించి రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం చేసినట్లు గుర్తించి ఇందుకు కారణమైన కోర్టు సిబ్బందిపై కేసు నమోదు చేసి హైకోర్టుకు నివేదించింది. ఈనేపధ్యంలో ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసిన సిబిఐ అధికారులు శుక్రవారం బృందాలుగా ఏర్పడి కృష్ణాజిల్లా వచ్చారు. ఓ బృందం నందిగామ అనాసాగరంలోని సత్యంబాబు ఇంట్లో అతన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో మరో బృందం కృష్ణాజిల్లా గూడవల్లిలోని కోనేరు సతీష్ నివాసంలో విచారణ జరిపారు. కోనేరు రంగారావు మనుమడైన సతీష్ అప్పట్లో ఈకేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే సతీష్‌ను తాజాగా సిబిఐ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించారు. ఇదే సమయంలో ఘటన జరిగిన దుర్గాహాస్టల్‌కు చెందిన సిబ్బందిని కూడా సిబిఐ విచారించనుంది.
కావాలనే ఇరికించారు : సత్యంబాబు
ఇదిలావుండగా సిబిఐ అధికారుల విచారణలో పిడతల సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘అప్పటి పోలీసు అధికారులు మా అమ్మని చెల్లిని చంపేస్తామని, నన్ను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు.. ఆ హత్య కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను కావాలనే బెదిరించి ఈ కేసులో ఇరికించారు. కొంతమంది అధికారులు కేవలం ప్రమోషన్ల కోసం కక్కుర్తి పడి నున్న ఇరికించారు.’ అంటూ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా సత్యంబాబును సిబిఐ బృందం సుమారు ఐదు గంటల పాటు విచారించినట్లు సమాచారం.