క్రైమ్/లీగల్

అంబులెన్స్‌లో ‘పంచాయతీ’ మద్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 18: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల మద్యం మత్తులో ముంచెత్తి గెలిచేందుకు అధికారులకు అనుమానం రాకుండా సరికొత్త మార్గాల్లో మద్యం సరఫరా చేసేందుకు అభ్యర్థులు మార్గం సుగమనం చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలు అభ్యర్థులు వినియోగించుకుంటూ అంబులెన్స్‌ల్లో సైతం మద్యం సరఫరా చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఆరంభం నుండి ఇదే తరహాలో భారీ మొత్తంలో అంబులెన్స్‌ల్లో ఎవరికి అనుమానం రాకుండా తరలించుకుపోతున్న మద్యం వ్యవహారం గుట్టు శుక్రవారం కరీంనగర్ పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు కొంగొత్త దారుల్లో మద్యం, నగదు, బహుమతులు భారీ ఎత్తున అంబులెన్స్‌ల్లో గత కొంత కాలంగా పల్లెలకు తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు అంబులెన్స్‌లను తనిఖీ చేయగా రూ.1.2 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు పట్టుబడినట్లు కరీంనగర్ ఎసీపీ డాక్టర్ పి.అశోక్ తెలిపారు. ఇదే తరహాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు మరిన్ని మార్గాలను ఎంచుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విస్తృతంగా వాహనాల సోదాలు చేస్తున్నట్లు వివరించారు. చొప్పదండి మండలం కంతనపల్లికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ తిరుపతిని విచారించగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడితోట పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నారగోని విజయ్ కుమార్‌కు మద్యాన్ని చేరవేసేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఎవరికి అనుమానం రాకుండా అధికారుల కళ్లుగప్పి గత కొంత కాలంగా అంబులెన్స్‌ల్లో పలువురు అభ్యర్థులకు మద్యాన్ని చేరవేసినట్లు కూడా డ్రైవర్ తిరుపతి తెలిపారన్నారు. 1.2 లక్షల విలువ చేసే 20 కాటన్‌ల ఇంపీరియల్ బ్లూ ఫుల్ బాటిళ్లు, నాలుగు కాటన్‌ల కింగ్ ఫిషర్ బీర్లు స్వాధీనం చేసుకొని, అంబులెన్స్ సీజ్ చేశామని, డ్రైవర్ తిరుపతితో పాటు అభ్యర్థి విజయ్ కుమార్‌తో పాటు ఎక్కువ మొత్తంలో మద్యాన్ని విక్రయించిన ఆయన సోదరుడు రాంపూర్‌లోని మద్యం దుకాణం నిర్వహించే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్‌లను కూడా వదలకుండా అభ్యర్థులు మద్యం సరఫరా చేస్తుండడంతో వాటిని తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి తరహా విధానాలకు అభ్యర్థులు స్వస్తి పలకాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, బహుమతులను అందజేయడం నేరమేనన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులను పై వారిపై నమోదు చేసినట్లు వివరించారు. మద్యం దుకాణాల నిర్వాహకులు ఎక్కువ మొత్తాల్లో మద్యం విక్రయాలు జరిపిన సందర్భాలను వివరాలతో సహా ఆరా తీస్తున్నామని, తమ విచారణలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సరికొత్త మార్గాల్లో మద్యాన్ని చేరవేసేందుకు యత్నించే వారిపై ఎలక్షన్ కమీషన్ నియమ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేస్తామని ఎసీపీ డాక్టర్ పి.అశోక్ హెచ్చరించారు. ఈ దాడుల్లో టౌన్ సిఐ తుల శ్రీనివాస రావు, ఎస్‌ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.