క్రైమ్/లీగల్

కల్తీ పొటాషియం బస్తాలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, జనవరి 19: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో శనివారం 92 బస్తాల కల్తీ పొటాషియం బస్తాలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇటీవలకాలంలో త్రిపురాంతకంలో 350 బస్తాల కల్తీ పొటాషియంను విజిలెన్స్ అధికారులు పట్టుకోగా వారంరోజుల వ్యవధిలోనే పెద్దదోర్నాలలో మరో 92 బస్తాల కల్తీ పొటాషియం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ రజనీ ఆదేశాల మేరకు డివైఎస్పీ అజయ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఓ దుకాణంలో కల్తీ ఎరువులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈదాడుల్లో పట్టుబడిన కల్తీ పొటాషియంను రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్, విఆర్‌ఓలకు అప్పగించినట్లు తెలిపారు. ఈవిషయాన్ని వ్యవసాయ అధికారులకు తెలియచేసి పశ్చిమప్రాంతంలో లభ్యం అవుతున్న కల్తీ ఎరువులపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిపారు.