క్రైమ్/లీగల్

హుబ్లీ మట్కా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 9: కర్ణాటక రాష్ట్రం హుబ్లి కేంద్రంగా మట్కా కంపెనీ నిర్వహిస్తున్న అంతరాష్ట్ర నిర్వాహకుడు వినాయక్ మేత్రాని అనే కీలక నిందితునితో పాటు గంజాయి విక్రేతలు మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్ తెలిపారు. వీరి నుంచీ నాలుగు కిలోల గంజాయితో పాటు రూ.20,25,010 నగదు, కారు, మూడు సెల్‌ఫోన్లు, మట్కా సామాగ్రిని స్వాధనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్‌తో పాటు డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు విజయ్‌భాస్కర్‌గౌడ్, కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలలోని హుబ్లి కేంద్రంగా మట్కా నిర్వహిస్తున్నట్లు ప్రధాన నిందితుడు విచారణలో వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు నెలరోజుల వ్యవధిలోనే మట్కాపై దాడులతోనే రూ.50 లక్షల నగదును, నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు, మిగతా నిందితులతో కలిసి అనంతపురం, గుత్తి, కర్నూల్ జిల్లాలోని డోన్, తదితర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా మట్కా కొనసాగిస్తున్నాడన్నారు. అమాయక ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారన్నారు. అధిక మొత్తంలో డబ్బులు పొందుతూ హవాల పద్దతిలో దోచుకుంటూ చాలా మంది నిరుపేద, అమాయక ప్రజల ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. దీంతో పాటు గంజాయి విక్రయిస్తూ మత్తులో నింపి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ప్రజలను వీటి నుంచీ విముక్తి చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించిందన్నారు. జిల్లాలో ఇప్పటికే మట్కాపై నిఘా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో పోలీసుల పాత్ర ఖచ్చితంగా ఉంటే అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలో మట్కా తగ్గుముఖం పట్టిందన్నారు. మట్కాపై కఠినమైన చట్టాలు లేకపొవడంతో నిందితులు కేవలం కోర్టులో ఫైన్లు కట్టి బయట పడుతున్నారన్నారు. మళ్లీ మట్కా నిర్వహణకు వీరు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే ఇటువంటి వారిని గుర్తించి పీడీ యాక్ట్‌తో పాటు, జిల్లా బహిష్కరించటం జరుగుతుందన్నారు. ప్రజల నుంచీ కూడా తమకు సహాయ సహకారాలు ఉంటే మట్కాను నిర్ములించడాకి మరింత ఉత్సాహంతో ముందుకు వెళతామాన్నారు. వినాయక్ మేత్రాని, కర్నాటక రాష్ట్రం, దార్వాడ జిల్లా కేశావాపూర్ హుబ్లీ పట్టణం. తమటం రమేష్‌గౌడ్ కర్నూల్ జిల్లా డోన్ పట్టణం, గుత్తి హబీబ్‌ఖాన్ గుత్తిటౌన్, ఖతీబ్ స్ట్రీట్
జమాల్ బాషా సాబ్ కర్నాటకలోని దార్వాడ జిల్లా హుబ్లి గ్రామం
పట్నూరు షబ్బీర్ బాషా, అనంతపురం పట్టణ, పిల్లిగుండ్ల కాలనీ
పోతుల శంకర్ అనంతపురం పట్టణం, బిందెల కాలనీ. కాగా కర్ణాటక కేంద్రంగా మన జిల్లాతో పాటు కర్నూలు జిల్లాలో మట్కా నిర్వహణ, గంజాయి సరఫరా చేస్తున్న ఈ అంతరాష్ట్ర ముఠాను చాకచక్యంగా పట్టుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్‌తో పాటు అనంతపురం వన్‌టౌన్ సీఐ విజయ భాస్కర్‌గౌడ్, అనంతపురం రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐలు హమీద్‌ఖాన్, టి.మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు జయరాములు, ఖాజా మైనుద్దీన్‌లను ఎస్పీ అభినందించారు. వీరికి నగదు బహుమతిని అందజేశారు.