క్రైమ్/లీగల్

పంచాయతీ ఎన్నికల ఆర్డినెన్స్ సరైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిబంధనలకు అనుగుణంగానే ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, సామల రవీందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వాలని గతంలో ఆర్.కృష్ణయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయిందని, ప్రస్తుత దశలో ఎన్నికలు ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆర్.కృష్ణయ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం నిబంధలను దాటలేదు కదా అని పిటిషన్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పిటిషన్ తోసిపుచ్చింది.