క్రైమ్/లీగల్

ఐరన్ ఫ్యాక్టరీలో కార్మికుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, జనవరి 21: కొండపల్లి పారిశ్రామిక వాడలోని ఐరన్ ఫ్యాక్టరీలో కార్మికుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పినపాక శివారు కడిం పోతవరం గ్రామ పరిధిలో ఉన్న కామాక్షి స్టీల్స్ కంపెనీలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మున్నా ప్రభాస్ (23) అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. ఇనుము స్తంభాలు మీద పడి ఇతను మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షత్రగాత్రుడ్ని విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్‌పూర్ జిల్లా కొక్వాల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా మున్నా ప్రభాస్‌ను గుర్తించారు. మృతుని స్నేహితుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని, మృతదేహాన్ని సందర్శించడానికి కంపెనీ యాజమాన్యం మీడియాను అనుమతించక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. మైలవరం సిఐ సూరిబాబు, జి.కొండూరు ఎస్‌ఐ ఆష్ఫక్ కంపెనీలోనికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి, సమాచారాన్ని మీడియాకు తెలియచేశారు. సమగ్రంగా విచారించి నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసు అధికారులు రెండోసారి కంపెనీ వద్దకు చేరుకున్న తర్వాత కానీ మీడియాను అనుమతించలేదు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘం నేత మహేష్ కంపెనీ ఎదుట ధర్నా చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కంపెనీ యాజమాన్యం నైపుణ్యత లేని వారిని కంపెనీల్లో నియమించుకుంటుందన్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగి కార్మికుల విలువైన ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నట్లు ఆవేదన చెందారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు. పొరుగు రాష్ట్రాల కార్మికుల ప్రాణాలకు కొండపల్లి ఐడిఎలోని కంపెనీల్లో విలువ లేకుండా పోయిందన్నారు. లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కంపెనీలను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నేతలు కోరారు.
ఆటో బోల్తా పడి పది మందికి గాయాలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 21: స్థానిక మాచవరం మెట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. ప్రయాణీకులతో వెళుతున్న ఆటో రాత్రి 8గంటల సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న సుమారు పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై రాత్రి పొద్దుపోయే వరకు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందకపోవడం విశేషం.