క్రైమ్/లీగల్

ఏసీబీకి పట్టుబడ్డ మత్స్యశాఖ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర: మేడ్చల్ జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే- మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా మత్స్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరావు, మల్కాజ్‌గిరి శివపురి కాలనీలోగల మత్స్య మహిళా పారిశ్రామిక సహకార సొసైటీకి రివాల్వింగ్ ఫండ్ మూడు లక్షలు ప్రభుత్వం నుండి అందజేయాల్సి ఉంది. జిల్లా మత్స్యశాఖ నుండి మూడు లక్షలు సొసైటీలో వేయాలంటే పది వేలు లంచం ఇవ్వాలని సహకార సొసైటీ అధ్యక్షురాలు అనురాధను డిమాండ్ చేశారు. అనుకున్న వెంటనే మత్స్య సహకార సొసైటీకి మూడు లక్షలు అందజేసారు. పది వేలు లంచం ఇవ్వటానికి ఇష్టం లేని అనురాధ వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి వివరాలు తెలియజేసారు. వెంటనే రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం కీసరలోని కలెక్టరేట్ కార్యాలయం బీబ్లాక్‌లో గల జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో వెంకటేశ్వరావు 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకుని కార్యాలయంలోని రికార్డులను సీజ్ చేసారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ, తమకు ఫిర్యాదు అందిన వెంటనే వెంకటేశ్వరావుపై విచారణ జరిపామని, లంచం అడిగినట్లుగా రుజువైనందునే పక్కా ప్లాన్‌తో దాడులు చేశామని అన్నారు. ఎవరైనా లంచం అడిగతే తమకు 9440446140 నెంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు లక్ష్మీ, రామలింగారెడ్డి, రాజేశ్, గంగాధర్ పాల్గొన్నారు.