క్రైమ్/లీగల్

పట్టపగలే భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 22: రాజేంద్రనగర్ సర్కిల్లో పట్టపగలే భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించి పకడ్భందీగా దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏక మొత్తంగా సుమారు రూ.4 లక్షల నగదు, 18 తులాల బంగారు ఆభరణాలను దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. వివరాల ప్రకారం... నగర శివారు రాజేంద్రనగర్ సర్కిల్లోని అత్తాపూర్ డివిజన్‌లోని నందిముస్లాయిగూడ ప్రాంతంలో నివాసముండే మహేశ్వర్ తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మహేశ్వర్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం మహేశ్వర్ బంధువు మృతి చెందడంతో సంగారెడ్డిలోని బంధువు ఇంటికి వెళ్లాడు. నందిముస్లాయిగూడలోని మహేశ్వర్ నివాసంలో ఎవరూ లేకపోవడంతో ఇంటికి తాళం వేసి ఉండడంతో దుండగులు తమ చేతివాటాన్ని చూపారు. గుర్తు తెలియని దుండగులు మహేశ్వర్ ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారా తాళం పగులగొట్టి రూ.4 లక్షలు, 18 తులాల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం ఇంటికి రాగనే, తాళం పగులగొట్టి ఉన్న ఇంటిని చూసి మహేశ్వర్ ఆందోళనకు గురయ్యాడు. ఇంట్లో ఉన్న అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే మహేశ్వర్ రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ సురేష్, పోలీసులు సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే దొంగతనాలకు పాల్పడడంతో స్థానికంగా ఉన్న ప్రజలు సైతం భయాందోళనకు గురయ్యారు. ఇటివల నగర శివార్లలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి దోపిడీలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సీసీ కెమెరాలను ఉపయోగించి దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.