క్రైమ్/లీగల్

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం..రేపిస్టు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు నెల రోజుల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని చత్రినాక పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఛత్రినాక పోలీస్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్‌స్పెక్టర్ ఆర్.విద్యాసాగర్ రెడ్డి, ఎస్‌ఐ కే.హరిభుషణరావుతో కలిసి ఫలక్‌నుమ సబ్ డివిజన్ ఏసీపీ ఎంఏ.రషీద్ వివరాలను వెల్లడించారు. పాతబస్తీలోని జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన మతీన్ అలీఖాన్ (45) వృత్తి రీత్య డ్రైవర్. మతీన్‌కు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
ఈ క్రమంలో భర్తతో విభేదాలు రావడంతో ఏడాదికే భార్య అతడిని విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అలీఖాన్ కన్ను పక్కింటిలోని ఓ ఏడేళ్ల అబం భుభం తెలియని చిన్నారిపై పడింది. బాలిక ఇంట్లో ఎవ్వరు లేనిది చూసి, ఆదే అదనుగా భావించి అమెను మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలికపై లైంగికదాడిని అమె కుటుంబ సభ్యులు దీనిని గమనించారు. వారి రాకను పసిగట్టిన అలీఖాన్ అక్కడి నుంచి పారిపోయాడు. నెల రోజుల నుంచి ఇలా చేస్తున్నాడని చిన్నారి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఉన్న వారు చత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఫలక్‌నుమ ఏసీపీ మహ్మద్ అబ్దుల్ రషీద్ మీడియకు తెలిపారు.
చిత్రం..నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు