క్రైమ్/లీగల్

లాలూ దాణా కేసులో తీర్పు 19కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 17: బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా నిందితులుగా ఉన్న నాలుగో దాణా కుంభకోణం కేసులో తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. రెండు దశాబ్దాల క్రితం డుమ్కా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని మాజీ సీఎంలపై అభియోగం. ఈ కేసులో తీర్పు వాయిదా పడడం ఇది రెండోసారి. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శిక్షణకు వెళ్లినందున తీర్పు వచ్చే సోమవారానికి వాయిదా పడిందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తరఫున్యాయవాది ప్రభాత్ కుమార్ వెల్లడించారు. జడ్జి శివ్‌పాల్ సింగ్ శనివారం తీర్పును వెలువరిస్తానని తొలుత వెల్లడించిన విషయాన్ని కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. డుమ్కా ట్రెజరీ దాణా కేసులో లాలూ, మిశ్రాతోపాటు 29 నిందితులుగా ఉన్నారు. ఓ మాజీ ఐఏఎస్, పశు సంవర్ధక శాఖ అధికారులు ఈ కేసులో నిందితులు. 21 ఏళ్ల క్రితం దియోగఢ్ ట్రెజరీ నుంచి 89.27 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షకు గురై బిస్రా ముండా జైలులో ఉన్నారు.