క్రైమ్/లీగల్

ఈబీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: అగ్ర వర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) విద్య,ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ బీసీ సమైక్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తే రాజ్యాంగ స్పూర్తి దెబ్బతింటుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సామాజికంగా వెనుకబాటు తనం, గతంలో సమాజంలో సామాజిక వివక్షకు గురయ్యారా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారని ఆ పిటిషన్‌లో వెల్లడించారు. అలాగే ఏ కులానికి రిజర్వేషన్లు కల్పించిన సామాజిక ఆర్థిక సర్వే, జనభా గణన జరగాలని వీటన్నింటి జరపకుండా ఎలా అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తారని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.