క్రైమ్/లీగల్

మేకలను చోరీ చేస్తున్న ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 23: మధ్యాహ్నం రెక్కీ నిర్వహించి రాత్రి పూట మేకలను దొంగిలిస్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 21న పోలీసుస్టేషన్ పరిధి జోడిమెట్ల సమీపంలో 12 మేకలను దొంగిలించినట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఘట్‌కేసర్ క్రైం టీం పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఏదులాబాద్ చౌరస్తాలో అనుమానస్పద స్థితిలో తిరుగుచుండగా అనుమానం వచ్చిన క్రైం టీం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. నగరంలోని ఉప్పుగూడకు చెందిన మక్కల బిక్షపతి(33), మచ్చ బొల్లారం శివునిగుట్టకు చెందిన గోగికార్ సంజు(34)లు జట్టుగా ఏర్పడి ఘట్‌కేసర్, మీర్‌పేట్, ఉప్పల్ పోలీసుస్టేషన్ల పరిధిలో మేకల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. గ్రామాలను తిరిగి మేకల దొడ్లను అనువుగా ఉన్నవి ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. దొంగతనాలకు పాల్పడిన నిందితుల నుండి లక్షా ఒక వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు క్రైం డీఐ ఇన్స్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన ఎస్‌ఐ శంకర్, సిబ్బంది సింహచలం, అనుదీప్, చంద్రశేఖర్, శ్రీనివాస్‌లను అభినందించారు.