క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, జనవరి 23: వయోభారం ఒకవైపు... అనారోగ్యం మరోవైపు బాధిస్తుంటే జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు సేవించి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన వైనం ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వలసపల్లి గ్రామానికి చెందిన సత్యవోలు నాగభూషణం (90), మంగమ్మ (85) గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. నారుూబ్రాహ్మణ కులానికి చెందిన నాగభూషణం ఇప్పటివరకు తన వృత్తినే నమ్ముకుని కాలాన్ని వెళ్లదీస్తుండగా వయోభారంతో నాగభూషణం ఆ పనిని కూడా చేయలేని పరిస్థితిలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. వీరికి ప్రభుత్వం అందిస్తున్న పెన్షనే జీవనాధారమైంది. అంతేకాక ఇటీవల మంగమ్మకు కాలువిరగడంతో కనీసం వండిపెట్టే వారులేక ఈ వృద్ధ దంపతులు మరింత క్షోభకు గురయ్యారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా చూసే వారు లేకపోవడంతో తనువులు చాలించాలని అనుకున్నారు. వీరంతా వేర్వేరుగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వీరికి సరైన ఆదరణ లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు బుధవారం ఉదయం తమ ఇంట్లో ఉన్న పురుగుల మందును సేవించారు. నాగభూషణం గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే నురగలు కక్కుతున్న దంపతులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దంపతులు బుధవారం మృతి చెందారు. నాగభూషణం, మంగమ్మ దంపతులు పెద్ద కుమారుడు ఏలూరులో వెటర్నరీ వైద్యునిగా పనిచేస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. రెండవ కుమారుడు గ్రామంలోనే కులవృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా మూడవ కుమారుడు పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజిగూడెంలో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. ఎస్‌ఐ కెవిజివి సత్యనారాయణ కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ చెప్పారు.