క్రైమ్/లీగల్

సినీనటి భానుప్రియ ఇంట్లో బాలిక నిర్బంధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జనవరి 23: ప్రముఖ సినీనటి భానుప్రియ ఇంట్లో తమ కుమార్తెను నిర్బంధంలో ఉంచారని, పనికోసమని వెళ్ళిన తమ కుమార్తెను భానుప్రియ సోదరుడు లైంగిక వేదింపులకు గురిచేస్తున్నాడని, తమతో పంపించమని అడిగేందుకు వెళ్లిన తమపై దౌర్జన్యం చేశారంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన పెనుపాకల ప్రభావతి, తండ్రి రాజు బుధవారం సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడకు చెందిన 1098 చైల్డ్‌లైన్ ప్రతినిధులు జి విజయ్ కుమార్ సహాయంతో వారు సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసునాయక్‌ను పోలీస్ స్టేషన్‌లోకలసి ఫిర్యాదు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నైలోని సినీనటి భానుప్రియ ఇంట్లో తమ కుమార్తె పెనుపాకల సంధ్య (15) గత సంవత్సర కాలంగా పనిచేస్తోందని, అయితే భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తమ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నట్లు తమ కుమార్తె సంధ్య తమకు ఫోనులో పలుమార్లు వివరించి విలపించిందన్నారు. తాము వెళ్ళి తమ కుమార్తెను తమతో పంపించమని కోరగా వారు మీ అమ్మాయిని ఎప్పుడో పంపించేసామని చెప్పి దౌర్జన్యంగా మీదిక్కున్న చోట చెప్పుకోండని గెంటివేసారని ఆరోపించారు. ఏదో ఒక దొంగతం కేసులో ఇరికించి మీ అమ్మాయిని ఇబ్బందులకు గురిచేస్తామని బెదిరించారన్నారు. దాంతో ఏమీ తోచని స్థితిలో చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి సమస్యను చెప్పామని, వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ పీవో విజయకుమార్, ఎస్వీ రాఘవులు, కర్రి సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న చైల్డ్‌లైన్ సిబ్బంది, బాలిక తల్లిదంఢ్రులు (ఇన్‌సెట్‌లో)సంధ్య ఫైల్‌ఫోటో