క్రైమ్/లీగల్

రేడియో ధార్మిక పదార్థం ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 23: ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో మాయం అయిన సీఎస్ 137 రేడియో ధార్మిక మూలకం కంటైనర్ కేసును రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పేయి ఆధ్వర్యంలో నియమించిన ప్రత్యేక పోలీసు బృందం ఛేదించింది. గత వారం రోజులుగా తీవ్ర కలకలానికి గురి చేసిన రాజమహేంద్రవరం ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో కనిపించకుండా పోయిన రేడియో ధార్మిక మూలకం కలిగిన కంటైనర్ ఎట్టకేలకు దొరికింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్టయింది. కృష్ణాజిల్లా కలిదిండి గ్రామంలోని ఒక పాత ఇనుప సామాను గోడౌన్‌లో ఓఎన్జీసీ రేడియో ధార్మిక మూలకం కలిగిన కంటైనర్‌ను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం సీసీఎస్ అధికారులు వర ప్రసాద్, వివి రావు, ముక్తేశ్వరరావు, త్రినాధరావు, కానిస్టేబుళ్లు గుర్తించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సీఎస్ 137 అనే రేడియో ధార్మిక మూలకం కంటైనర్‌ను కలిదిండిలో గుర్తించినట్టు బుధవారం రాత్రి రాజమహేంద్రవరం పోలీసు గెస్ట్‌హౌస్‌లో అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషి బాజ్‌పాయితో పాటు అడిషనల్ ఎస్పీ రమణకుమార్, ఈస్ట్‌జోన్ డీఎస్పీ నాగరాజు తెలిపారు. కలిదిండి వద్ద పాత సామాగ్రి షెడ్డులో భద్రంగా దొరికిందని అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పేయి చెప్పారు. ఈ కంటైనర్‌ను గుర్తించిన పోలీసు బృందాన్ని ఆమె అభినందించారు. ఈ ఘటనపై సమద్ర దర్యాప్తు కొనసాగుతోందని, ఓఎన్జీసీ ప్రత్యేక వాహనంలో కలిదిండి నుంచి రాజమహేంద్రవరం బేస్ కాంప్లెక్సుకువ తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఓ ఎన్జీసీ నుంచి ఫిర్యాదు అందినప్పటి నుంచి పోలీసు ప్రత్యేక బృందాల పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వెంట పెట్టుకుని దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. ఈ పదార్ధం కలిగిన కంటైనర్ లభించిన వెంటనే ఓఎన్జీసీ అధికారులకు తెలియజేయడంతో ఓఎన్జీసీ సాంకేతిక అధికారులు, అధికారులు ప్రత్యేక ప్రమాణాలతో తరలించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. ఈ పదార్ధం భద్రంగా దొరికింది కాబట్టి ప్రజలు ఎటువంటి ఆందోళనకు చెందాల్సిన పని లేదని ఎస్పీ చెప్పారు.

చిత్రం..కలిదిండి వద్ద లభ్యమైన ధార్మిక మూలకం కంటైనర్ కేసు