క్రైమ్/లీగల్

ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్‌పై సీబీఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. జాదవ్‌తో పాటు అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్పీ నక్వా, మాజీ అడిషనల్ జనరల్ మేనేజర్లు ఎ.కథ్‌పాలియా, అమితాబ్ సింగ్, రోహిత్ బాసిన్‌లపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. అధికారులకు పదోన్నతి కల్పించేందుకు 2010లో ఏర్పాటు చేసిన ప్యానల్‌కు జాదర్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) హోదాలో ఉండేవారు. ఈ ప్యానల్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుస్తావ్ బల్ద్ఫా, ఏఎస్ సోమన్ మాజీ ఈడీ ఎల్‌పీ నక్వా సభ్యులుగా ఉన్నారు. ఎయిర్ ఇండియాలో జనరల్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్)లో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న నక్వాను తాత్కాలికంగా అప్‌గ్రేడ్ చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమెకు సెప్టెంబర్ 1, 2009లో పదోన్నతి కల్పించారు. అయితే నిర్దేశిత సమయం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1, 2009లో ఆమెను రివర్ట్ చేస్తూ పూర్వస్థానం జనరల్ మేనేజర్ హోదాలోకి పంపించారు. అయితే ఏవియేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఆమె పాత హోదాలోకి వెళ్లకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానే కొనసాగారు. ఈ విషయంలో ప్యానల్‌కు జనరల్‌మేనేజర్‌గా వ్యవహరించిన జాదవ్ అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపణ. ఇది ఎయిర్ ఇండియా ప్రమోషన్ పాలసీని ఉల్లంఘించడమేనని పేర్కొంది. కమిటీ మెంబర్‌గా ఉభ్న నక్వాకు పదోన్నతి కల్పించడమం నిబంధనలకు ఉల్లంఘించడమేనని, ఆమె ఆ పదవికి అర్హురాలు కాదని తెలిసినప్పటికీ జాదవ్ ఆమెను నియమించారని సీబీఐ తెలిపింది. కాగా, ఈ ప్యానల్ అడిషనల్ జనరల్ మేనేజర్స్ (ఆపరేషన్స్) ర్యాంకు అధికారులకు జనరల్ మేనేజర్‌గా పదోన్నతి కల్పించేందుకు 15 మందిని ఇంటర్వ్యూకు పిలిచిందని సీబీఐ అధికారులు చెప్పారు. ఈ ప్యానెల్ ఎ.కథ్‌పలియా, అమితాబ్ ఇసంగ్, రోహిత్ బాసిన్, ఏకె గుజ్రాల్, ఎన్‌కె బేరిలకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే వీరిలో కథ్‌పాలియాపై క్రిమినల్ కేసు ఉందని, బాసిన్ సింగ్మరో ఇద్దరిపై పలు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపై విచారణ పెండింగ్‌లో ఉందని, మరో ఇద్దరిపై సైతం పలు ఆరోపణలు ఉన్నాయని ఇలా నియామకాల్లో పలు అక్రమాలకు పాల్పడిన జాదవ్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ వెల్లడించింది.