క్రైమ్/లీగల్

చనిపోయన వ్యక్తి లేచి వస్తాడని సమాధి వద్ద కాపలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, జనవరి 25 : సమాజం ఆధునిక యుగంలో దూసుకుపోతుంటే కొంతమంది మాత్రం భూతవైద్యాన్ని మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి బతికి వస్తాడని భూతవైద్యులు చెప్పడంతో లక్షలు ఖర్చుచేయడానికి సిద్ధపడ్డారు. చనిపోయి 40 రోజులైనా ఆ వ్యక్తి బతికొస్తాడని శ్మశానంలో సమాధి చుట్టూ కంపచెట్లతో కంచె వేసుకుని రాత్రి పగలు కాపలా ఉంటున్న వైనం నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. వివరాలిలా ఉన్నాయి. వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనివాసులు అలియాస్ వాసు అనే యువకుడు నాలుగు నెలల క్రితం కువైట్ నుంచి పెట్లూరు వచ్చాడు. అయితే వాసు బంధువులు కడప జిల్లా రైల్వేకోడూరులో ఉండటం అతను ఒక టాటాఏస్ వాహనం కొని కోడూరు-రేణిగుంట మధ్య తిప్పుకుంటూ అక్కడ ఉంటూ వచ్చాడు. రెండు నెలల క్రితం వాసుకి స్వైన్‌ఫ్లూ సోకి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వాసు బంధువులు మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన పెట్లూరుకి తీసుకొచ్చి ఖననం చేశారు. అయితే వారం రోజుల తరువాత కడప జిల్లాకు చెందిన ఓ భూతవైద్యుడు వాసు అనారోగ్యంతో చనిపోలేదని, ఎవరో చేతబడి చేయడంతో చనిపోయాడని వాసు బంధువులకు చెప్పి నమ్మించాడు. వాసుని తాను 40 రోజుల్లో బతికిస్తానని, అతను సమాధి నుంచి లేచే సమయంలో చేతబడి చేసిన వ్యక్తి మళ్లీ అక్కడకు వచ్చి చంపుతాడని, 40 రోజుల పాటు అక్కడకు ఎవరినీ రానివ్వకుండా రాత్రి పగలు కాపలా ఉండాలని సూచించాడు. దీనికి సుమారు రూ.6 లక్షల మేరకు ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి రెండు మూడు రోజులు వాసు బంధువులు గ్రామంలో ఎవరికీ తెలియకుండా శ్మశానంలో కాపలా ఉంటూ వచ్చారు.
ఈ విషయం గ్రామంలో లీక్ కావడంతో ఆ నోట ఈ నోట విషయం చుట్టుపక్కల గ్రామాలకూ పాకింది. చనిపోయిన మనిషిని బతికించడం ఏమిటి? ఎప్పుడు ఎక్కడా చూడటం గాని, వినడం గాని లేదని ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. శ్మశానం వద్దకెళితే ఆ భూతవైద్యుడు మనల్ని కూడా చంపుతాడంటూ ఎవరూ అక్కడకి వెళ్లలేదు. 40 రోజులు కావస్తున్నా చనిపోయిన వ్యక్తి ఇంకా బతకలేదని, కుటుంబ సభ్యులు మాత్రం అక్కడే ఉండటంతో ఆలస్యంగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎఎస్‌ఐ మాల్యాద్రి, సిబ్బంది శుక్రవారం ఉదయం పెట్లూరులో వాసును పూడ్చిపెట్టిన సమాధి వద్దకు చేరుకున్నారు.
పోలీసులు వాసు సమాధి వద్ద ఉన్న బంధువులను ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించగా తమ బిడ్డ చనిపోయాడని, అతని జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని, సమాధి వద్ద కుర్చొని బాధపడుతున్నామని పోలీసులను పక్కదారి పట్టించే విధంగా చెప్పారు. ముందే విషయం తెలుసుకున్న పోలీసులు సమాధుల వద్ద అన్నం తినే గినె్నలు, వస్తువులు ఎందుకు ఉన్నాయి, రాత్రి పూట శ్మశానంలో మీకేం పని అంటూ గట్టిగా గద్దించడంతో నీళ్లు నమిలారు. దీంతో పోలీసులు సమాధి వద్ద ఉన్న వాసు తల్లిదండ్రులు, బంధువులను విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్థానిక ఎస్‌ఐ కొండపనాయుడు శ్మశానం వద్ద రాత్రి గాని, పగలు గాని ఎవరైనా ఉన్నట్లు తనకు మళ్లీ సమాచారం అందితే అందరినీ అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఇకమీదట అలాంటి పనులు చేయబోమని, మమ్మల్ని వదిలిపెట్టాలని అడగడంతో వారిని ఎస్‌ఐ ఇంటికి పంపారు. ఇదిలావుండగా పోలీసులు రంగంలోకి దిగి బాధితులను విచారించి భూతవైద్యుడిని అరెస్టుచేయాలని, బాధితుడి వద్దనుంచి ఎంత సొమ్ము తీసుకున్నదీ తెలుసుకుని, దాన్ని భూతవైద్యుడి వద్ద నుంచి రాబట్టి బాధితులకు అప్పగించాలని స్థానికులు కోరుతున్నారు.