క్రైమ్/లీగల్

మావోయిస్టు కరపత్రాల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జనవరి 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కరపత్రాలు వెలిశాయ. పంగిడిపల్లి, పెద్దంపల్లి, రామకృష్ణాపురం (వి), వెలిశాల గ్రామాలలో కరపత్రాలు కలకలం రేపాయి. మావోయిస్టుల పేరున లభ్యమైన కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లభ్యమైన మావోయిస్టు కరపత్రాలలో మోడి నాలుగున్నర సంవత్సరాల పాలనలో విప్లవకారులను, ఆదివాసీలను, దళితులను, మైనార్టీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని కరపత్రంలో ఆరోపించారు. అదే విధంగా మైనార్టీలు, మహిళలు, హేతువాదులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు, కళాకారులు, జర్నలిస్టులు సమాధాన్ దాడిలో భాగంగానే బూటకపు ఎన్‌కౌంటర్‌లు, హత్యలు చేయించారని పేర్కొన్నారు. మరో కరపత్రంలో అర్బన్ నక్సలైట్ల పేరుతో వరవరరావు, గౌతమ్‌నవలఖా, సుధభరద్వాజ్, కెర్నన్ గుంజాల్వేస్, అరుణ్ పెరేరా, సోమాసేన్, సురేంద్ర గాడ్జింగ్, రోనావిల్సన్, సుధీర్ థాట్లే, మహేష్ రౌత్‌లను అక్రమంగా అరెస్టు చేసి జైళ్లో బంధించడాన్ని, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిపై తప్పుడు కేసులు, అబద్ధపు కేసులతో జీవిత ఖైదు విధించడాన్ని, ఉమర్ ఖలీద్ లాంటి యువ స్కాలర్‌పై హత్యాప్రయత్నాన్ని, కన్హయ్యకుమార్ లాంటి వాళ్లను అరెస్టు చేయడానికి తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించండి, వారి విడుదల కోసం పోరాడండి అని పత్రాలను విడుదల చేశారు. జనవరి 25 - 31 మధ్య సమాధాన్ దాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన వారం జనవరి 31న భారత్ బందును జయప్రదం చేయండి అని పేర్కొన్నారు.