క్రైమ్/లీగల్

నీరవ్ మోదీ భవనం కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయగఢ్ (మహారాష్ట్ర), జనవరి 25: ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన బంగ్లాను అక్రమమైనదని ప్రభుత్వం తేల్చడంతో, ఆ భవనాన్ని అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఈ భవనం సముద్ర తీరంలో నీరవ్‌మోదీ నిర్మించారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నేరగాడు ఈ భవనాన్ని నిర్మించారు. ఈ వివరాలను కలెక్టర్ సూర్యవంశి తెలిపారు. ముంబయికి 90 కి.మీ దూరంలో కిహిమ్ బీచ్ తీరంలో ఉన్న ఈ భవనంతో పాటు మరో 58 భవనాలు అక్రమంగా నిర్మించారని అధికారులు ప్రకటించారు. ఈ భవనాలను భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారు. ముంబయి హైకోర్టులో దాఖలైన ఒక పిల్ కేసులో వచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఈ భవనాన్ని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పిల్‌ను ఎన్‌జీవో శాంబూర్జే యువ క్రాంతి అనే వ్యక్తి 2009లో దాఖలు చేశారు. ఈ ప్రాంతంలో అనేకమైన భవనాలను అక్రమంగా నిర్మించారు. తాము జప్తు చేసిన భవనాల్లో నీరవ్‌మోడీ భవనం కూడా ఉన్నందున, దీనిని కూల్చరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టును ఆశ్రయించింది. ఇందులో ఉన్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న తర్వాత బంగ్లాను జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. ఈ భవనం ఖరీదు రూ.100 కోట్లు ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ భవనానికి నీరవ్‌మోదీ, ఆయన మామ, సహనిందితుడు మెహుల్ చోక్సీల ఉమ్మడి ఆస్తిగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు.