క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్ అదుపులో ఇద్దరు గుట్కా వ్యాపారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 26: ఒరిస్సా బరంపూర్ కేంద్రంగా వివిధ రకాల గుట్కా, పాన్‌మసాలాలను నగరానికి తరలించి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు ఎనిమిది లక్షలు విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. రామలింగేశ్వర్‌నగర్ కట్ట, బిస్కట్ కంపెనీ రోడ్డులో నివాసముంటున్న కనమర్లపూడి సాయికృష్ణ (34), పటమట ఎన్టీఆర్ సర్కిల్ రామాలయం రోడ్డులో నివాసముంటున్న కొలిశెట్టి శేషగిరిరావు (68) ఇద్దరూ కలిసి గత కొంతకాలంగా రాష్ట్రంలో నిషేధించిన గుట్కాల వ్యాపారం గట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఒరిస్సా బరంపూర్ జిల్లాలో బహిరంగ మార్కెట్‌లో అతి తక్కువ ధరకు గుట్కా కొనుగోలు చేసి లారీల్లో నగరానికి తీసుకువచ్చి రామలింగేశ్వర నగర్ కట్ట వద్ద ఓ గోడౌన్‌లో నిల్వ చేస్తూ ఇక్కడ స్ధానిక చిల్లర వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పట్టుబడిన నిందితుల్లో సాయికృష్ణపై గుట్కా విక్రయాలకు సంబంధించి ఏడు పాత కేసులు అదేవిధంగా శేషగిరిరావుపై ఒక కేసు నమోదైంది. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఏసీపీ రాజీవ్‌కుమార్, సిఐ ఆర్ సురేష్‌రెడ్డి ఆధ్వర్యాన దాడులు నిర్వహించి సుమారు ఎనిమిది లక్షలు విలువైన వివిధ రకాల బ్రాండ్ల గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని ఆటో, మోటారు సైకిల్ సీజ్ చేశారు.