క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, జనవరి 27: రోడ్డు ప్రమాదానికి గురై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి యాచారం సీఐ మధుకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం మండల పరిధిలోని తక్కళ్ళపల్లి గేటు వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఓ గుర్తు తెలియని వ్యక్తి (50)ని ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు, పోలీసుల సహాయంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. చికిత్స సమయంలో వివరాలు వెల్లడించ లేకపోవడంతో మృతుని బంధువులకు పోలీసులు వివరాలు తెలయజేయలేదు. మృతుని ఎడమ చేతిపై పాపమ్మ అని పచ్చబొట్టు ఉన్నదని, మృతుని వివరాలు తెలిసినవారు యాచారం పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ కోరారు. మృతుని శవాన్ని పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.