క్రైమ్/లీగల్

పేరుకుపోతున్న పెండింగ్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలోని హైకోర్టులు, దిగువ కోర్టుల్లో రోజురోజుకు పెండింగ్ కేసుల సంఖ్య కొండలా పేరుకుపోతున్నాయి.
ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఆదివారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా డిసెంబర్, 2018 నాటికి హైకోర్టుల్లో 47.68 లక్షలు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 2.91 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండిపోయాయని, ఒక్కో హైకోర్టు జడ్జి వద్ద 4,500 కేసులు, దిగువ కోర్టుల్లో ఒక్కో జడ్జి వద్ద 1300 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హైకోర్టుల్లో, ఆయా కోర్టులో ఉన్న జడ్జిల సంఖ్య ఆధారంగా ఈ సరాసరి సంఖ్యను నిర్ధారించినట్టు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ తెలియజేసింది. ఇప్పటివరకు దేశంలో 24 హైకోర్టులు ఉండగా, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు రావడంతో వాటి సంఖ్య 25కు చేరిందని చెప్పారు. అలాగే సబార్డినేట్ కోర్టులు 22,644 ఉండాల్సి ఉండగా 17,509 మాత్రమే ఉన్నాయి. వీటికి 5,135 మంది జ్యుడీషియల్ ఆఫీసర్సు కొరత ఉంది. అలాగే హైకోర్టులో మంజూరైన వాస్తవ జడ్జి పోస్టుల సంఖ్య 1,079 కాగా, 384 మంది జడ్జిలు తక్కువగా 695 మంది మాత్రమే ఉన్నారు. పార్లమెంట్‌కు అవసరమైన సమాచారం నిమిత్తం ఈ డేటాను సేకరించారు. గతంలో దిగువ కోర్టుల్లో జడ్జిల పోస్టులను భర్తీ చేయాలని చీఫ్ జస్టిస్‌లకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభ్యర్థనలు పంపా రు. జ్యుడీషియల్ అధికారులు, సిబ్బందిని నియమించకపోతే పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని న్యాయస్థానాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, దానికి సంబంధించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూలు వంటి ప్రక్రియలను నిర్వహించాలని కేంద్ర మంత్రి చీఫ్ జస్టిస్‌లను కోరారు.