క్రైమ్/లీగల్

జింక కొమ్ములు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్వశ్రీరాంపూర్, జనవరి 27: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో ఆదివారం జింక కొమ్ములను ఎస్‌ఐ షేక్ మస్తాన్ వలీ పట్టుకున్నారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. పిక్కల కుమార్ ఇంటిలో జింక కొమ్ములు ఉన్నట్లు సమాచారం మేరకు సోదా చేయగా జింక కొమ్ములు లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే జింక కొమ్ములను స్వాధీనం చేసుకొని కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కొమ్ములను ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.