క్రైమ్/లీగల్

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జనవరి 27: చెడ్డిగ్యాంగ్ పేరుతో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆదివారం గద్వాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ షాకీర్ హుస్సేన్ వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం, దోహద్ జిల్లాకు చెందిన సంగాడ వీర్‌సింగ్, మఖోడియ ఖనీష్ భాయ్, రాజు సింగాడ, సోముసింగ్, మహారాష్టక్రు చెందిన కమల్ అనే వ్యక్తులు దోహద్ జిల్లాలోని సమీప ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో రాత్రి వేళలో షాప్‌లలో, ఇండ్లలో దొంగతనానికి పాల్పడుతుండే వారని పేర్కొన్నారు. చెడ్డి గ్యాంగ్ ప్రచారంలో ఉండటంతో వీరు నేరాలకు పాల్పడే సమయంలో చెడ్డీలు ధరించి, చుట్టు ప్రక్కన అందుబాటులో ఉన్న ఇనుపరాడ్లను మరియు రాళ్లను తీసుకొని వాటితో తలుపుల యొక్క తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారన్నారు. జనవరి 4న గుజరాత్ నుంచి కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చేరుకొని, అక్కడి నుంచి గద్వాల, రాయచూర్ డెమో రైళ్లులో గద్వాల పట్టణానికి చేరుకొన్నారు. రెక్కి నిర్వహించి, జనవరి 5 తెలవారుజామున పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోకి మధుబాబు అనే ఇంట్లో చొరబడి అర తులం బంగారం, రూ.12వేలు నగదును అపహకరించారు. జనవరి 6 రాత్రి కర్ణాటక రాష్ట్రం ఎరిగెర గ్రామంలో ఇనుపరాడ్లతో ఒక బంగారు దుకాణం యొక్క షట్టర్ తాళాలను విరగగొట్టి రెండు వెండి చేతి కడియాలు, మూడు వెండి ఉంగరాలు, ఒక సన్నని చైన్‌లను దొంగిలించుకొని పారిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకొన్న గద్వాల పట్టణ పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని సిసి కెమెరాల్లో రికార్డు అయిన వీడియోల ద్వార నిందితుల కదలికలను, చిత్రాలను సేకరించి సైబర్‌బాద్ పోలీసులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. గద్వాల పట్టణ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు బృందం గుజరాత్‌కు వెళ్లింద న్నారు. గుజరాత్ పోలీసుల సహకారంతో దోహద్ జిల్లాలోని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. కమల్, రాజు సంగాడ, సోము సింగ్‌లను త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో సమర్థవంతముగా పని చేసిన సీఐ హనుమంతు, పట్టణ ఎస్సైలు సత్యనారాయణ, బాలవెంకటరమణ, పోలీస్ సిబ్బంది జగదీష్‌కుమార్, ప్రసాద్‌లను డీఎస్పీ అభినందించారు.
చిత్రం.. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ షాకీర్ హుస్సేన్