క్రైమ్/లీగల్

బుర్దాన్ పేలుళ్ల కేసులో ఇద్దరు తీవ్రవాదుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/కోల్‌కతా, జనవరి 29: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి కాదర్ కాజీ(32)అనే తీవ్రవాదిని ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) తీవ్రవాద సంస్థకు చెందిన కాజీ ఆరాంబాగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని దొంగల్ మోర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. 2014లో సంచలనం సృష్టించిన బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో కాజీని పరారీలో ఉన్న నేరస్తుడిగా పోలీసులు ప్రకటించారు. అప్పటి నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం అర్థరాత్రి అతణ్ని పట్టుకున్నట్టు ఎన్‌ఐఏ పోలీసులు వెల్లడించారు. కాజీ అనుచరుడు సజ్జద్ అలీని కూడా అరెస్టు చేసినట్టు వారు తెలిపారు. సజ్జద్ కూడా జేఎంబీ విచ్ఛిన్నకర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వాడని వారన్నారు. జేఎంబీ తీవ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న తమ బృందాలు ఆరాంబాగ్‌లోని హుగ్లీలో ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు. ఇద్దర్ని అరెస్టు చేశామని బుర్ద్వాన్‌లోని ఖాగ్రాగఢ్ పేలుళ్లతోనూ వీరికి సంబంధంపై విచారణ జరుపుతున్నట్టు వారు చెప్పారు. కాదర్ పశ్చిమ బెంగాల్‌లోని బిర్‌భూమ్ జిల్లా నానూర్‌కు చెందినవాడు. సజ్జద్ ముర్షిదాబాద్ జిల్లా కందికి చెందినవాడు. 2014 అక్టోబర్ 2న ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంట్లో పేలుళ్ల జరిగా ఇద్దరూ కనిపించకుండా పోయారు. కొద్దినెలల క్రితమే ఇద్దరూ పశ్చిమబెంగాల్‌కు తిరిగి వచ్చినట్టు ఎన్‌ఐఏ పోలీసులు పేర్కొన్నారు. మళ్లీ ఏదైదా విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న ప్రశ్నకు ‘ఇప్పటికైతే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. విచారణ జరపాల్సి ఉంది’అని వెల్లడించారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న పత్రాలు, సామగ్రిని పరిశీలించాల్సి ఉందన్నారు. జేఎంబీ నేత కౌసర్ అలీని అరెస్టు చేసిన విచారించగా కాదర్, సజ్జద్ గురించి సమాచారం పోలీసులు రాబట్టారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద 30 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు.