క్రైమ్/లీగల్

జూబ్లీహిల్స్‌లో పేలుడు కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 29: పాత పెయింట్ డబ్బా తెరిచే ప్రయత్నంలో అది పేలింది. పేలుళ్లలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జూబ్లీహిల్స్ ప్రాంతలో ముకుందం అనే వ్యక్తి చిత్తుకాగితాలు సేకరించి జీవనం కొనసాగిస్తుంటాడు. చిత్తు కాగితాలతోపాటు డబ్బా దొరికింది. వాటిని పట్టుకుని వెంకటగిరిలోని షాపువద్దకు అమ్మడానికి తీసుకొచ్చాడు. చెత్తకొనుగోలు దుకాణం యజమాని డబ్బాను ఖాళీ చేసి తీసుకురమ్మని ముకుందానికి చెప్పాడు. అతడు డబ్బాలో ఉన్న పెయింట్ తీసేందుకు దాన్ని మ్యాన్‌హోల్‌కు వేసి కొట్టాడు. దీంతో ఒక్కసారి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముకుందం చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దానికి ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.