క్రైమ్/లీగల్

గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, జనవరి 29: గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ రూ. కోట్లు గడించిన ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎల్బీనగర్‌లోనీ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమీషనర్ మహేష్‌భగవత్ నిందితుల వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన జిన్న కాంతయ్య అలియాస్ జిన్న శ్రీకాంత్ అలియాస్ జిన్న శ్రీకాంత్‌రెడ్డి(47) ఉప్పల్‌లో నివాసం ఉంటూ గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో కంపెనీ ప్రారంభించాడు. వ్యాపారంలో కొత్తపేట్ హుడాకాలనీకి చెందిన సంకు భాస్కర్‌యాదవ్ (46), విశాఖపట్నంకు చెందిన లంకప్రియ (30), వెంకటేశ్వర్‌రెడ్డి, అలహ్యరెడ్డి, అనీల్‌రెడ్డిలను భాగస్వాములుగా చేర్చుకున్నాడు. అంజయ్యగౌడ్, సంతోష్‌లను ఉద్యోగులుగా నియమించుకున్నాడు. మొదటగా కంపెనీకి రూ. లక్ష రూపాయలు చెల్లించి భాగస్వాములుగా చేరి నూనె తీసే మిషన్‌లను పొంది పల్లీ నూనెను తీసి ఇవ్వాలని స్కీమ్ పెట్టాడు. నూనె, పల్లీ గింజలను ఇస్తే అధిక మొత్తంలో కమీషన్ ఇస్తామని నమ్మించారు. దాంతో పాటు కంపెనీలో ఎవరినైనా భాగస్వాములను చేస్తే కూడా కమీషన్ ఇస్తామని చెప్పారు. అమాయక ప్రజల నుండి అధిక మొత్తంలో కాజేసీ మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌యాదవ్, లంకప్రియలను అరెస్టు చేశారు.
వారివద్ద నుండి రూ. 21.20లక్షల నగదు, రూ. 90లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, (టీఏస్08జిసి0123) టాటా హెక్సా కారు, సెల్‌ఫోన్‌లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ముఠా ఆస్తులు రూ. వందకోట్లు ఉంటుందని తెలిపారు. ఇటీవల కర్నూల్‌లో భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.