క్రైమ్/లీగల్

బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 29: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ ఇందిరానగర్‌లో నివసిస్తున్న చింతల సాగర్ (20) స్నేహితుడు మధుతో కలిసి బైక్‌పై సోమవారం రాత్రి ఉప్పల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు పీర్జాదిగూడ కమాన్ వద్ద అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొని కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన సాగర్ మరణించగా, మధు గాయపడ్డాడు. మృతుడు తండ్రి జ్ఞానేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.