క్రైమ్/లీగల్

హంద్రీ-నీవా అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జనవరి 29: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై హంద్రీ-నీవా ప్రాజెక్టు సర్వేయర్ జి.వెంకటరమణారెడ్డి ఇంటితోపాటు ఏకకాలంలో ఏడుచోట్ల అవినీతి నిరోధకశాఖ అధికారులు మూకుమ్మడిగా సోదాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం బ్యాంకర్స్ కాలనీలోని హంద్రీ-నీవా ప్రాజెక్టు డిప్యూటీ సర్వేయర్ జి.వెంకటరమణారెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహించిన వివరాలను ఏసీబీ అదనపు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చిత్తూరు జిల్లా అరగొండకు చెందిన జి.వెంకటరమణారెడ్డి 1996 మార్చి 20వ తేదీన ప్రభుత్వ సర్వేయర్‌గా చిత్తూరులో విధులలో చేరారు. మదనపల్లె మండల సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తూ వారంరోజుల కిందట హంద్రీ-నీవా కార్యాలయానికి బదిలీ అయ్యారు. సర్వేయర్ రమణారెడ్డి పేరున నెల్లూరు జిల్లా కొత్తూరులో డూప్లెక్ ఇళ్ళు, మదనపల్లె పట్టణం హెచ్‌ఎంఎస్ టవర్స్‌లో ప్లాటు, అతని భార్య జ్యోత్స్న పేరున మదనపల్లె మండలం వలసపల్లెలో రెండంతస్తుల ఇళ్లు, పట్టణంలో రెండస్థుల ఇళ్లు, ఇండస్ట్రియల్ పార్కులో తాత్కాలిక రేకులషెడ్డు, ఫోర్డ్ కారుకు సంబంధించిన రికార్డులు, రూ.1,40,000ల నగదు స్వాధీనం చేసుకుని రమణారెడ్డిని అరెస్టుచేసి నెల్లూరు కోర్టుకు తరలిస్తున్నట్లు అదనపు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండల తహశీల్దారు కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్‌గా పనిచేస్తున్న జి.వెంకటరమణారెడ్డిపై మదనపల్లె నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ విభాగం అదనపు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి, పుంగనూరు, చౌడేపల్లె మండలం దుర్గసముద్రం పంచాయతీ, మదనపల్లె పట్టణంలో రమణారెడ్డికి సంబంధించిన ఆస్తులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించామన్నారు. ఈ సోదాలలో ఏసీబీ సీఐలు ప్రసాద్‌రెడ్డి, గిరిధర్, విజయశేఖర్, కానిస్టేబుళ్లు ఉన్నారు.