క్రైమ్/లీగల్

పరువునష్టం కేసులో వివేక్‌దోవల్ స్టేట్‌మెంట్ నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: అసత్య ఆరోపణలతో తనపై ఆర్టికల్‌ను ప్రచురించినందుకు, దానిని ఆధారంగా చేసుకుని విమర్శలు చేసినందుకు ‘ద కారవాన్’ మేగజైన్‌పై, కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్‌పై అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్ వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి ఆయన స్టేట్‌మెంట్‌ను కోర్టు బుధవారం రికార్డు చేసింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ వద్ద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. తనపై ఆరోపణలు అన్నీ ఆధార రహితమని, మేగజైన్‌లోని కథనం ఆధారంగా జైరాం రమేష్ చేసిన నిరాధారణ ఆరోపణలు తన పరువుకు తీవ్ర భంగం కలిగించేవిధంగా ఉన్నాయని ఆయన కోర్టుకు తెలియజేశారు. ఆయనతో పాటు అతని స్నేహితుడు నిఖిల్‌కపూర్, వ్యాపార భాగస్వామి అమిత్‌శర్మ కూడా వివేక్‌దోవల్‌కు అనుకూలంగా తమ స్టేట్‌మెంట్లను ఇచ్చారు. ద కారవాన్ మేగజైన్, జైరాం రమేష్ తన తండ్రి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగానే తనపై ఈ ఆరోపణలు చేశారని ఆయన తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పలువురి ప్రకటనలు రికార్డు చేయాల్సి ఉందని పేర్కొంటూ కోర్టు కేసును ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. కాగా, ద కారవాన్ మేగజైన్ ఆన్‌లైన్‌లో జనవరి 16న ‘ద డీ కంపెనీస్’ శీర్షికతో ఒక వార్తాకథనాన్ని ప్రచురించింది. పన్నుకట్టని వారికి స్వర్గ్ధామంగా భావించే కేమాన్ ఐలాండ్స్‌లో వివేక్ దోవల్ పెట్టుబడులు పెట్టి హెడ్జింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. మోదీ 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన 13 రోజుల తర్వాత ఇది జరిగిందని పేర్కొంది.