క్రైమ్/లీగల్

జగన్‌పై హత్యాయత్నం కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 30: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తును నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) హైకోర్టులో బుధవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కోడికత్తితో జగన్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు శ్రీనివాసరావు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నాడు. అయితే కోడికత్తి కేసు విచారణను కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21వ తేదీన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఎన్‌ఐఏ దర్యాప్తు నిలుపుదల చేస్తూ స్టే విధించాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ అనంతరం ఈనెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరగ్గా తక్షణమే ఎన్‌ఐఏ దర్యాప్తును నిలిపివేయాలని ప్రభుత్వం తరుఫు వాదనలు వినిపించారు. ఇదే సమయంలో గత హైకోర్టు ఆదేశాలతో మేరకు ఎన్‌ఐఏ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటర్‌పై తమ వాదనలు వినిపించేందుకు మరింత గడువు కావాలని ప్రభుత్వం కోర్టును కోరడంతో విచారణ ఫిబ్రవరి 12కి న్యాయమూర్తి వాయిదా వేశారు. హైకోర్టులో ఎన్‌ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసే సమయం దగ్గరపడుతున్నందున ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోందని సందర్భంగా కోర్టు వెలుపల పిటిషనర్ తరుఫు న్యాయవాది ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఎన్‌ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను కోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదని అన్నారు.