క్రైమ్/లీగల్

ఆదాయానికి మించిన ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), జనవరి 31: అవినీతి నిరోధక శాఖాధికారులకు భూగర్భ గనుల శాఖ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ గొండు శివాజీ చిక్కారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లిలోని మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శివాజీ ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్టు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజాము నుండే ఏసీబీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో నిర్వహించారు. విశాఖ ఎంవీపీ కాలనీలో గల శివాజీ ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆరు లక్షల రూపాయల నగదు, పావు కిలో బంగారం ఆభరణాలు, రెండు బ్యాంక్ లాకర్లు పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు దొరికాయి. అదే విధంగా ఎంవీపీ కాలనీలోని అతని సోదరుడు బాలాజీ నివాసముంటున్న ఇంటిపై, విజయనగరంలోని రింగురోడ్డులో గల మరో సోదరుని ఇంటిపై, విజయనగరం జిల్లా డెంకాడ మండలం బంటుపల్లిలోని శివాజీ స్వస్థలంలోని ఇంటిపై, అనకాపల్లిలోని అతని కార్యాలయం, భీమిలిలోని పెద్దపాలెంలో గల బంధువుల ఇంటిపై ఏకకాలంలో ఏసీబి అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తంగా ఏసీబీ అధికారులకు దొరికిన నగదు రూ.8,77,000లు కాగా, 1798గ్రాముల బంగారం, పలు ఆస్తుల డాక్యుమెంట్లు చిక్కాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లల్లో కోట్లాది రూపాయల మేరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ కింజరాపు రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు.
చిత్రం..భూగర్భ గనుల శాఖ ఏడీ శివాజీ