క్రైమ్/లీగల్

యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జనవరి 31: ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి గ్రామంలో గురువారం దివ్యశ్రీ (21) అను వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతూ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టరం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
చెనే్నకొత్తపల్లి, జనవరి 31 : పురుగుల మందు తాగి ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని హరియాన్ చెరువు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పక్కీరప్ప(34) పురుగుల మందు తాగి మృతి చెందాడు. అయితే మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. సికెపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.