క్రైమ్/లీగల్

కోర్టు ధిక్కారానికి పాల్పడిందంటూ ఎన్‌ఐఏపై పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 31: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు కస్టడీకి తీసుకుని విచారించే సమయంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు శ్రీనివాసరావు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నాడు. కాగా.. అంతకుముందు నిందితుడిని కోర్టు అనుమతితో ఎన్‌ఐఏ అధికారులు వారంరోజులు తమ కస్టడీకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో శ్రీనివాసరావును అతని న్యాయమూర్తి సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించింది. అయితే శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు తమ కస్టడీకి తీసుకుని విచారించి ఆ తర్వాత తిరిగి కోర్టుకు హాజరుపరిచిన మధ్యకాలంలో సుమారు 30 గంటల పాటు తనకు తెలియకుండా విచారణ సాగించారని, ఇది కోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ నిందితుని తరుఫు న్యాయవాది ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు దిక్కారణ కింద పరిగణించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏ అధికారులను ఆదేశించారు. దీంతో తమకు కొంత సమయం కావాలని ఎన్‌ఐఏ తరుఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.