క్రైమ్/లీగల్

పోలీసుల వేధింపులు భరించలేక దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి,జనవరి 31: పోలీసుల వేధింపుల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ బంధువులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగి దాదాపు ఐదు గంటలపాటు మృతదేహాలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గుంటూరుజిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన దంపతులు మిరియాల వెంకట కిరణ్ (31), ఇతని భార్య హెలీనా (28) గురువారం తెల్లవారుఝామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సీఐ, ఎస్సై వేధింపుల వల్లనే ఈ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, దళిత సంఘాలు, మృతుల బంధు మిత్రులు మృతదేహాలను మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్‌కు తీసుకొచ్చి నడిరోడ్డుపై పెట్టి రహదారిపై సుమారు 5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. పోలీసు, రెవిన్యూ అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించడంతో రాత్రి ధర్నాను విరమించారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయిన మృతుడి తండ్రి మిరియాల సుబ్బారావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మిరియాల వెంకట కిరణ్ గడిచిన మూడేళ్లుగా తమ్మిశెట్టి రాజశేఖర్, రామకృష్ణ, సతీష్, వెంకట్రావు, యోగేష్ (హైదరాబాద్), జగపతి (హైదరాబాద్)లతో కలిసి జాబ్ కన్సల్టెన్సీని నడుపుతున్నారు. రామకృష్ణ అనే అతను ఎఫ్‌సిఐలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పగా నమ్మిన కొందరు రాజశేఖర్ ద్వారా డబ్బులు చెల్లించి వెంకట కిరణ్‌ను మధ్యవర్తిగా ఉంచారు. ఉద్యోగాలిప్పించక పోగా రాజశేఖర్, రామకృష్ణ కలిసి నగదును సొంతానికి వాడుకుని వెంకట కిరణ్‌పై కృష్ణాజిల్లా ఇబ్రహీపట్నం పోలీసుస్టేషనులో కేసు నమోదు చేయించారు. ఇబ్రహీంపట్నం ఎస్సై సత్యనారాయణ విచారణ కోసం వెంకట కిరణ్‌ను తీసుకెళ్లి గడిచిన రెండురోజులుగా బెదిరించి చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండు పేపర్లపై సంతకాలు చేయించుకుని సెల్‌ఫోను కూడా లాక్కున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి పంపారు.
గురువారం ఉదయం 7 గంటల కల్లా స్టేషన్‌కు రాకుంటే ఎన్‌కౌంటర్ చేస్తామని వెంకట కిరణ్‌కు హెచ్చరిక జారీ చేశారు. పోలీసులు పెట్టిన బాధలను వెంకటకిరణ్ తండ్రికి చెప్పాడు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వెంకట కిరణ్‌ను లేపేందుకు తలుపు తట్టగా భార్య, భర్తలు పలకక పోవడంతో కిటికీ పగులగొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకుని కన్పించారు. వారిని కిందికి దించి చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు. పోలీసుల వేధింపుల వల్లే వెంకటకిరణ్, హెలీనా దంపతులు బలన్మరణానికి పాల్పడినందున బాధ్యులైన పోలీసుల పైనా, జాబ్ కన్సల్టెన్సీ భాగస్వాములుగా ఉన్న ఆరుగురు పైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇద్దరి శవాలను ఆటోలో వేసుకుని మంగళగిరి అంబేద్కర్ విగ్రహం సెంటర్‌కు చేరుకుని నడిరోడ్డుపై మృతదేహాలను పెట్టి ధర్నాకు దిగారు. దళితుడైన జిల్లాకు చెందిన మంత్రి నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి సహాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే మృతదేహాలను తీసుకెళ్తామని, లేకుంటే శవాలను తీసుకుని అసెంబ్లీకి వెళతామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. పోలీసులపైనా, మరో ఆరుగురి పైనా కేసులు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు అందజేశారు. అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రామకృష్ణ, సీఐలు బాలాజీ, రవిబాబు తదితరులు ధర్నా విరమించాలని పదే పదే జరిగిన చర్చలు జరిపినా శాంతించలేదు. కుటుంబానికి రెండు ఎకరాల భూమి, ఒకరికి ఉద్యోగం, మృతులు ఒక్కొక్కరికీ 50 లక్షల రూపాయల నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ వసంతబాబు, పోలీసు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించిన ధర్నా రాత్రి 7 గంటలకు విరమించారు.
చిత్రం.. వెంకట కిరణ్ మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగిన ఎమ్మెల్యే ఆర్కే, దళిత సంఘాల నేతలు