క్రైమ్/లీగల్

గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం కేసులో ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలీగఢ్, జనవరి 31: జాతిపిత మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను తుపాకీతోకాల్చి దహనం చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లోకి రావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బుధవారం రాత్రి 13 మందిపై కేసు నమోదైంది. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి పూజాశకున్ పాండే నాయకత్వాన ఓ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన కొందరు వికృతచేష్టలకు దిగారు. మహాత్మాగాంధీ దిష్టిబొమ్మపై మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తరువాత దహనం చేశారు. యూపీలోని నౌరంగబాద్‌లోని హిందూమహాసభ కార్యాలయం ఎదుటే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
సంఘటన జరిగిన ప్రాంతం గాంధీపార్క్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంది. శౌర్య దివస్ సందర్భంగా మహాత్మాగాంధీ వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు హిందూ మహాసభ ప్రకటించింది. ఐపీసీలోని 147,148,149 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ ఎస్పీ వెల్లడించారు. ఇలా ఉండగా హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి పూజా పాండే పరారీలో ఉన్నారు.