క్రైమ్/లీగల్

ఎలాంటి చర్యలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాల రద్దు వివాదంపై ఆరువారాల వరకూ తదుపరి చర్యలపై ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర రావు సోమవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. మరో పక్క ఈ నెల 22లోగా అసెంబ్లీలో జరిగిన ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజీని సీల్డు కవర్‌లో హైకోర్టు ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని న్యాయమూర్తి ఆదేశించింది. శాసనసభ సభ్యత్వాల రద్దుకు సంబంధించి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి మార్చి 12న శాసనసభలో జరిగిన ఘటన దృశ్యాల వీడియో ఫుటేజీని ఇవ్వాలని , పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని, ప్రభుత్వాన్ని ఆదేశించారు. వారం రోజుల వరకూ ఎన్నికల ప్రక్రియను చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే అభ్యంతరమా అని ఎన్నికల తొలుత సంఘాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. మధ్యాహ్నం 3.30 గంటల్లోగా దానిపై
అభిప్రాయం చెప్పమని కోర్టు ఈసీ కౌన్సిల్ అవినాష్ దేశాయ్‌ను ఆదేశించింది. ఏం పర్వాలేదని, ఏ నిర్ణయమైనా 10 రోజుల తర్వాతనే తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాల రద్దు వివాదంపై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. అసెంబ్లీ కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల శాఖ తరఫున అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించారు. గవర్నర్ ప్రసంగం శాసనసభ సమావేశాల పరిధిలోకే వస్తుందని ఏజీ వాదించారు. సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినపుడు సభ్యత్వం రద్దు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుందని పేర్కొన్నారు. శాసనసభ్యత్వాల రద్దు నిర్ణయం స్పీకర్ తీసుకున్నది కాదని, సభ తీసుకున్న నిర్ణయమని ఆయన అన్నారు. శాసనసభ్యుల సభ్యత్వం రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే అధికారం సభ్యులకు లేదని , సభలో గౌరవంగా ఉండాలని అన్నారు. జరిగిన ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, సభ్యుడ్ని సస్పెండ్ చేస్తే ఆయా నియోజకవర్గానికి చెందిన ప్రజలకు శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతుందని, అదే సభ్యత్వం రద్దు చేసి ఎన్నికలు నిర్వహిస్తే వెంటనే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం దక్కుతుందని ఏజీ వాదించారు. శాసనసభ చేసిన తీర్మానంపై స్పీకర్ తదుపరి చర్యలు తీసుకున్నారని ఏజీ అన్నారు. దానికి న్యాయమూర్తి స్పందిస్తూ సభ తీసుకున్న తీర్మానం కాపీని సభ్యులకు అందించారా అని ప్రశ్నించారు. శాసనసభ వెబ్‌సైట్‌లో దానిని అప్‌లోడ్ చేశామని ఏజీ చెప్పారు. అధికారికంగా ఇచ్చారా లేదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అవసరమైతే ఇపుడు కూడా ఇచ్చేందుకు సిద్ధమేనని ఏజీ వివరించారు. గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు అసెంబ్లీ అధికారాన్ని తేల్చి చెప్పాయని అన్నారు. సభ్యుల అనుచిత ప్రవర్తన ఆధారంగానే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని వివరించారు. దెబ్బ తగిలిందా లేదా అనేది ముఖ్యం కాదని సభ్యులు ఎలా ప్రవర్తించారనేదే ముఖ్యమని వాదించారు. తమ వద్ద ఉన్న దృశ్యాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీని ఈ నెల 22లోగా సీల్డు కవర్‌లో సమర్పించాలని మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చారు. తొలుత ఫుటేజీ ఇవ్వడం కుదరదన్న ఏజీ తర్వాత అందుబాటులో ఉన్న ఫుటేజీని ఇస్తామని చెప్పారు. వారంలోగా పూర్తి వివరాలను సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని, ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి కేసు విచారణను మార్చి 27కు వాయిదా వేశారు.