క్రైమ్/లీగల్

పాపం లాలూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: అవినీతి కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్న ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగో దాణా కేసులోనూ దోషిగా తేలారు. 1990లో డుమ్కా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయల అక్రమంగా విత్‌డ్రాచేసిన కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్డు దోషిగా తీర్పునిచ్చింది. మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 69 ఏళ్ల ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు 18 మందిని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ దోషులుగా తీర్పునిచ్చారు. అలాగే జగన్నాథ్ మిశ్రాతోపాటు 12 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. డుమ్కా ట్రెజరీ నుంచి అక్రమ విత్‌డ్రా కేసులో 120బీ, 409, 402, 467, 468, 471 477/ఏ, సెక్షన్ 13(2),13(ఐ) సీ అండ్ డీ కింద అవినీతి నిరోధక చట్టం 1988 కింద కేసులు నమోదుచేసి చార్జిషీట్ దాఖలు చేశారు. తాజా తీర్పుపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. కోర్టు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటారని, తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తారని ఆయన అన్నారు. డియోగఢ్ ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులు విత్‌డ్రా చేసిన కేసులో శిక్ష పడ్డ లాలూ ప్రసాద్ బిస్రా ముండా జైలులో ఉన్నారు. రెండో పశుదాణా కేసులో డిసెంబర్ 23 సీబీఐ ప్రత్యేక కోర్టు ఆనను దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలుశిక్ష పడ్డ లాలూ లోక్‌సభకు అనర్హత వేటుపడింది. తీర్పు నేపథ్యంలో ఆరేళ్లపాటు లాలూ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. నాలుగో దాణా కేసులో మొత్తం 47 మందిపై ఆరోపణలు వచ్చాయి. కేసు విచారణలో ఉండగానే 14 మంది మృతి చెందారు. ఇద్దరు అప్రూవర్లగా మారారు. ‘కోరుూ కామెంట్ నహీ కర్నా హై’ అంటూ కోర్టు వెలుపల లాలూ వ్యాఖ్యానించారు. ఇప్పటికి రెండు దాణా కుంభకోణాల కేసుల్లో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా నిర్దోషిగా బయపడ్డారు. నాలుగో కేసులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మాజీ చైర్మన్ జగదీష్ శర్మ, ధృవ్ భగత్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే రాణా, బిహార్ మాజీ మంత్రి విద్యాసాగర్ నిషాద్ నిర్దోషులుగా విడుదలయ్యారు.

చిత్రం..బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను
సోమవారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్డు నుంచి వెలుపలకు తీసుకువస్తున్న పోలీసులు