క్రైమ్/లీగల్

దొంగతనానికి పాల్పడిన నలుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 5: దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వౌలాలిలో నివసించే ఎండీ నదీమ్(34), సఫిల్‌గూడలో నివసించే సాయి వెంకట్(20), చర్లపల్లిలో నివసించే కొండ మధు(23), వినోద్ కుమార్(24) స్నేహితులు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వౌలాలిలో నివసించే దీప్‌రాజ్ ఇంట్లో సెల్‌ఫోన్, రూ.28 వేల నదగు దొంగిలించి తప్పించుకు తిరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం వౌలాలిలో అనుమానస్పదంగా తిరుగుతున్న విరిని పట్టుకుని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. నలుగురిని అరెస్టు చేసి సెల్‌ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
నాలుగు తులాల బంగారం, నగదు చోరీ
కులకచర్ల, ఫిబ్రవరి 5: ఇంటికి తాళం వేసి ఊరెళ్లిన ఓ ఉద్యోగి ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన కులకచర్లలో వెలుగు చూసింది. అద్దెకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశం, భార్య మొగులమ్మ రెండు రోజుల క్రితం ఊరెళ్లారు. ఇది గమనించిన దొంగలు సోమవారం రాత్రి ఇంటి తాళం విరగొట్టి బీరువాలోని బంగారం నగదు దోచుకెళ్లారు. సుమారు నాలుగు తులాల బంగారం, రూ. లక్ష నగదు అపహరించినట్లు బాధితులు చెబుతుండగా, రక్షకభటులు మాత్రం రెండు తులాల బంగారం, రూ.25 వేలు దొంగిలించినట్లు చెబుతున్నారు. రక్షకభట నిలయానికి కూత వేటు దూరంలోని కల్యాణనగరంలో దొంగతనం జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్.ఐ తెలిపారు.