క్రైమ్/లీగల్

అత్త హత్య కేసులో అల్లుడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 5: చెడు అలవాట్లు మానుకుని బుద్ధిగా కాపురం చేసుకోవాలని అత్త మందలించిందని కక్ష పెంచుకున్న అల్లుడు పథకం ప్రకారమే హతమార్చాడని, ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని కొత్తపేట సీఐ ఎండీ ఉమర్ తెలిపారు. మంగళవారం కొత్తపేట పోలీసు స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 29న షేక్ కరీమా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమె భర్త షేక్ ఇస్మాయిల్ స్వయానా చిన్నల్లుడు షేక్ టిప్పుసుల్తాన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీవీఆర్ బ్రిడ్జి సమీపంలో రైలు పట్టాల పక్కన జనసంచారం లేని ప్రాంతంలో కరీమా మృతదేహం లభించింది. పోలీసులు తమ విచారణలో టిప్పుసుల్తాన్ నిందితుడని గుర్తించారు. హత్య జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు నైజాంగేటు రైల్వే క్వార్టర్ల వద్ద మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సమాచారం అందిన సీఐ ఉమర్ తన సిబ్బందితో అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని సీఐ తెలిపారు. అత్త పలుమార్లు అవమానించడం వల్లే హతమార్చానని, పెద్దల్లుడు దివ్యాంగుడు కావడంతో ఎమ్మెల్యే వద్ద తోపుడు బండి ఇప్పిస్తానని నమ్మించానని కూడా తెలిపాడు. అత్తను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాయితో ముఖం, తలపై పదేపదే మోది హతమార్చానని టిప్పుసుల్తాన్ అంగీకరించాడని సీఐ వివరించారు. ఈ కేసులో సాంకేతిక సాక్ష్యాధారాలతో నిందితుని నేరం నిరూపితమైందని తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరుపర్చగా 15రోజులు రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.