క్రైమ్/లీగల్

ఆటో బోల్తా మహిళకు తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరఘట్టం, ఫిబ్రవరి 6: మండలంలోని చిట్టిపుడివలస జంక్షన్ వద్ద బుధవారం ఆటోబోల్తాపడిన సంఘటనలో చలివేంద్రి గ్రామానికి చెందిన వారాడ వరహాలమ్మ (58) తీవ్రంగా గాయపడింది. మండల కేంద్రమైన వీరఘట్టం నుంచి పార్వతీపురం వెళుతున్న ఆటో చిట్టిపుడివలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రమాదానికి గురైంది. వెంటనే గాయపడిన వరహాలమ్మను 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తలకు బలమైన గాయం కారణంగా రిమ్స్ వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పి విశాఖపట్నం తరలించినట్టు బంధువులు తెలిపారు. స్థానిక ఎస్ ఐ జి.అప్పారావు ప్రమాద సంఘటన వద్దకు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.