క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, ఫిబ్రవరి 6 : మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ శేఖర్ (30) మృతి చెందినట్లు ఎస్సై నాగమధు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు శేఖర్ బొమ్మనహాల్ నుంచి సొంత గ్రామం దేవగిరి గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా రెవెన్యూ కార్యాలయం సమీపంలోకి రాగానే ఎదురుగా బొలేరో వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రగాయాలపాలైన క్షతగాత్రుడిని బళ్లారికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా శేఖర్ హమాలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఇతనికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు.