క్రైమ్/లీగల్

గుట్కా తయారీ కేంద్రంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, ఫిబ్రవరి 6: పాన్ మసాలా పేరుతో అనుమతి తీసుకుని గుట్కా, ఖైనీ తదితర నిషేధిత పదార్థాలను రహస్యంగా తయారుచేస్తున్న స్థావరంపై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు బుధవారం దాడులుచేశారు. ఈసందర్భంగా రూ.15 లక్షల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకెట్లు, వాటి తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను సీజ్‌చేశారు. అలాగే ప్యాకింగ్ తదితరాలు ఉపయోగించే యంత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలావున్నాయి... పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఒక ఇంట్లో గుట్కా, ఖైనీ తదితరాలు తయారవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీనితో జిల్లా కేంద్రం ఏలూరు నుండి వచ్చిన ప్రత్యేక బృందం, ఉండి, భీమవరం పోలీసులు బుధవారం మెరుపు దాడులు జరిపారు. ఈసందర్భంగా ఎన్నార్పీ అగ్రహారంలోని ఒక ఇంట్లో గుట్కా, ఖైనీ తయారవుతున్నట్టు గుర్తించారు. అలాగే గణపవరం రోడ్డులోని ఒక కర్మాగారం సమీపంలోని భవనం, వాండ్రం రహదారిలో ఒక నిర్మానుష్య ప్రదేశంలోని భవనంలో తయారైన సరుకు నిల్వచేసినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా సుమారు 20 బస్తాల వరకు గుట్కా, ఖైనీ ప్యాకెట్లు, మూడు బస్తాలు ముడిసరుకు లభ్యమైనట్టు భీనమవరం రూరల్ సీఐ పి సునీల్‌కుమార్ తెలిపారు. ఉండికి చెందిన కెల్లా రామారావుకు పాన్‌మసాలా ప్యాకెట్ల తయారీకి అనుమతి ఉందని, దాన్ని ఆధారంగా చేసుకుని అనధికారికంగా గుట్కా, ఖైనీ తదితరాలను పెద్దఎత్తున తయారుచేస్తున్నాడని తెలిపారు. వీటి తయారీకి ఉపయోగించే మూడు యంత్రాలు కూడా సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. ముడిసరుకు కూడా మహారాష్ట్ర నుండి రప్పిస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ వివరించారు.

చిత్రం.. పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా, ఖైనీ ప్యాకెట్ల తయారీ యంత్రం