క్రైమ్/లీగల్

రూ. 20 లక్షలు జరిమానా కడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడానికి సంబంధించి హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా అరెస్టు చేసిందుకు ప్రభుత్వం రేవంత్‌రెడ్డికి రూ. 20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది హైకోర్టు వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తమకు కొంత గడువుకావాలని కోర్టును అభ్యర్థించారు. కేసు పూర్తి వివరాలు అందచేయడానికి కొంత సమయం ఇవ్వాలని కోరడంతో బెంచ్ అంగీకరించింది. ఎన్నికల సమయంలో వికారాబాద్ పోలీసులు రేవంత్‌రెడ్డి అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన కేసు విచారణ హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌తో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. తనను అక్రమంగా అరెస్టు చేయడంతోపాటు ఇంటి తలుపులు బలవంతగా బద్దలు కొట్టి మరీ తనను ఈడ్చుకెళ్ళారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ప్రభుత్వంపై ఆయన పిటిషన్ వేశారు. బుధవారం నాటి విచారణకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్ సభ ఏర్పాటు చేశారని అన్నారు. అదే సందర్భంలో రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో బంద్ పాటించాలని పిలుపు ఇవ్వడంతో శాంతిభద్రతల దృష్ట్యా రేవంత్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరింత గడువు ఇస్తే పూర్తి వివరాలను కోర్టుకు అందచేస్తానని చెప్పడంతో కేసును ఈనెల 25కు వాయిదా వేసింది.