క్రైమ్/లీగల్

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్(ఖైరతాబాద్), ఫిబ్రవరి 6: హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. పం జాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగా ఝాన్సీ(21) హైద రాబాద్ పంజాగుట్టలోని నాగార్జున నగర్ కాలనీ శ్రీసాయిరామ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉం టోంది. గతంలో మా టీవీలో ప్రసారమైన పవిత్రబంధం సీరియల్‌లో నటించింది. ఝాన్సీకి కొంతకాలం క్రితం విజయవాడకు చెందిన సూర్యతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. సీరియల్స్‌లో నటించవద్దని సూర్య చెప్పడంతో నటన మానుకుంది. ఇటీవలే అమీర్‌పేటలో ఓ బ్యూటీపార్లర్‌ను ప్రారంభించింది. ఏం జరిగిందో ఏమిటో మంగళవారం ఇంటికి వెళ్లి ఉరే సుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా ఝాన్సీ గది నుంచి ఎలాంటి స్పం దన రాలేదు. కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని నిర్జీవంగా కనిపించింది. ఒక్కసారి షాక్‌కు గురై పోలీసులకు దుర్గాప్రసాద్ సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ప్రాథమిక విచారణ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదులో తన సోదరిని విజయవాడకు చెందిన సూర్య అనే వ్యక్తి ప్రేమ పేరుతో మో సం చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని ఝాన్సీకి చెందిన రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్‌డేటా, ఫోన్‌లో ఉన్న సమాచా రం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

ఝాన్సీ (ఫైల్)