క్రైమ్/లీగల్

ప్రైవేట్ సంస్థలకు భూములెందుకు కట్టబెడుతున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 6: వ్యాపార సంస్థలకు ఒక పక్క పెద్దమొత్తంలో భూమిని కేటాయిస్తున్న ప్రభుత్వం మరోపక్క ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారిని వెళ్లగొట్టడంలో ఎందుకు ఉత్సాహం చూపిస్తోందని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమకు అదనంగా వెల్లూరు జిల్లాలోని కాట్పడిలో మరో 41.92 ఎకరాలు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ వెల్లూ రు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ ఎస్‌ఎం సుబ్రహ్మణియన్, భూమి కేటాయింపును తిరస్కరిస్తూ రెవెన్యూ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించారు. ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని కోరడం సమంజసం కాదని, దానికి అలాంటి హక్కు ఎన్నడూ లేదని ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్ అయిన విఐటి ఇప్పటికే ప్రభుత్వం నుంచి 98.80 ఎకరాలను తన విద్యాసంస్థల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం నుంచి పొందిందని, దానికి ఇంకా భూమి అవసరమైతే డబ్బిచ్చి కొనుక్కోవాలే తప్ప, ప్రభుత్వమే తమకు భూమి కేటాయించాలంటూ హక్కుగా అడగడమేమిటని ప్రశ్నించింది. ఆ సంస్థ ఏమన్నా అందరికీ ఉచిత విద్యను అందిస్తోందా? వ్యాపార దృక్పథంతోటే కదా పనిచేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం తమ భూములను ఆక్రమించారంటూ పలువురు సామాన్యులను వెళ్లగొట్టే పని హుషారుగా చేస్తోందని, తాము ఉండటానికి కేవలం ఒకటి రెండు సెంట్ల స్థలాన్ని మాత్రమే ఆక్రమించుకుని ఉంటున్న వారిని పంపించడానికి చొరవచూపుతున్న ప్రభుత్వం పూర్తి వ్యాపార దృక్పథంతో ఉన్న ప్రైవేట్ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. అలాగే స్పోర్ట్సు డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రభుత్వం 41.92 ఎకరాలు కేటాయించిందని, అసైన్‌మెంట్ భూములు ప్రజలకు ఉపయోగపడే సంస్థలకు మాత్రమే ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అసైన్డ్ భూములన్నవి ప్రజల ఆస్తి అని, వాటిని ప్రజోపయోగ కార్యక్రమాలకు, పథకాలకు కేటాయించాలే తప్ప ప్రైవేట్ సంస్థల అభివృద్ధికి కాదని అన్నారు. అలా కేటాయిస్తే పౌరులకు రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను కాలరాయడమే అవుతుందని అన్నారు. పౌరుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపర్చేలా ఈ పోరంబోకు భూములను అభివృద్ధి చేయాలని అన్నారు. ఒకవేళ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయనుకుంటే వాటికి ఫెన్సింగ్ వేసి పరియించాలని జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణియన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.