క్రైమ్/లీగల్

నకిలీ పాస్‌పోర్టు : ఒకరికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మార్చి 19: నకిలీ పాస్‌పోర్టుతో నగరానికి చేరుకున్న ఒక వ్యక్తిని పోలీసులు రిమాండ్ చేశారు. శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు... కేరళ రాష్ట్రానికి చెందిన సయ్యద్ రఫీ (35) ఉపాధి కోసం రియాద్‌కు వెళ్లాడు. అక్కడ యజమానులు పాస్ట్‌పోర్టు తీసుకోవడంతో స్వదేశానికి వచ్చేందుకు ఏజెంట్ ద్వారా అనిల్‌కుమార్ పేరుతో ఉన్న మరో పాస్‌పోర్టును కొనుగోలు చేశాడు. ఆ పాస్‌పోర్టుతో సోమవారం రియాద్ నుంచి బయలుదేరిన రఫీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. తనిఖీలు నిర్వహిస్తున్న ఇమిగ్రేషన్ అధికారులు నకిలీ పాస్‌పోర్టుతో నగరానికి వచ్చినట్టు గుర్తించారు. అతన్ని శంషాబాద్ పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.