క్రైమ్/లీగల్

విద్యార్థి హత్య కేసులో ఇద్దరిఅరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 19: కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి సుధీర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను ఏసీపీ భుజంగరావు వెల్లడించారు. కూకట్‌పల్లి నడిరోడ్డుపై విద్యార్థి సుధీర్ (19) దారుణ హత్య కేసులో పరారీలో ఉన్న తేజ, కృష్ణను సోమవారం ఉదయం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. సమావేశంలో కూకట్‌పల్లి సీఐ వడ్డే ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.